వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వలంటీర్లను వదులుకోబోమన్న సీఎం....
0 Comments । By Black Cat News । 26 August, 2024

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. గడచిన కొన్నాళ్లుగా వాలంటీర్లుపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. వైసిపి ప్రభుత్వంలో నియమితులైన ఎంతో మంది వాలంటీర్లు ఎన్నికల సమయంలో రాజీనామా చేశారు. ఇప్పటికీ అనేక మంది వాలంటీర్లు కొనసాగుతున్నారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు రూ.10,000 గౌరవ వేతనంగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆయా వాలంటీర్లంతా ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాజీనామా చేయకుండా కొనసాగిన నేపథ్యంలో తమను కొనసాగిస్తారన్న భావనలో వాలంటీర్లు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాలంటీర్లకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో వారంతా నిరుత్సాహంలో ఉన్నారు. తాజాగా వాలంటీర్లకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో వలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంపై ఎట్టకేలకు సర్కారు క్లారిటీ ఇచ్చింది. వలంటీర్లను వదులుకునేది లేదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు వాలంటీర్లకు బకాయి ఉన్న గౌరవ వేతనాలను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్టు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Krishna